
బాలాజీకి జాతీయ ఫొటోగ్రాఫర్ అవార్డు
అవార్డు అందించిన బాలాజీ తీసిన చిత్రం
అవార్డు అందుకుంటున్న బాలాజీ
వేటపాలెం: వేటపాలేనికి చెందిన గాత్రం బాలాజీ మోహన్‌కృష్ణ జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర టూరిజం, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చేతుల మీదుగా ఫొటోగ్రాఫర్ బాలాజీ సోమవారం అవార్డు అందుకున్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అకాడీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి వారి సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహించారు. ఫొటో ట్రావెల్ విభాగంలో బాలాజీ మోహనకృష్ణకి మెరిట్ సర్టిఫికెట్‌తోపాటు ప్రైజ్‌మనీ అవార్డు లభించింది. గతంలో కూడా బాలాజీ తీసిన ఉత్తమ ఫొటోగ్రఫీలో అనేక ఉత్తమ అవార్డులు అందుకున్నారు.

బాలాజీకి జాతీయ ఫొటోగ్రాఫర్ అవార్డు