
వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు పటిష్టం
కొల్లూరు: వరద ప్రభావిత ప్రాంతాలలో పటిష్టవంతమైన రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అధికారులను ఆదేశించారు. మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున చినరేవు లో లెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ వరద తీవ్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాలలో పశువుల కాపరులతోపాటు, స్థానిక ప్రజలు నదిలో దిగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, కొల్లూరు ఎస్‌ఐ జానకిఅమరవర్ధన్ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ