
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు
బల్లికురవ: ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చని బాపట్ల జిల్లా అడిషనల్ డీపీఎం మోహన్ తెలిపారు. సోమవారం నక్కబొక్కలపాడు గ్రామంలో ఎన్‌పీఎం షాపులో కషాల తయారీని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పంటల సాగులో చీడపీడల నివారణకు అవసరమైన కషాయాలను ముందుగానే తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగువైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రైతు తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు. మాస్టర్ ట్రైనర్ అప్పారావు, ప్రకృతివ్యవసాయ ఇన్‌చార్జి కల్పన ఉన్నారు.