
నూతన బార్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.వెంకటేశ్వర్లు
బాపట్లటౌన్: నూతన బార్ పాలసీ విధానాన్ని ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న 2022–2025 బార్ పాలసీను రద్దుచేసి 2025–2028 సంవత్సరాలకుగానూ నూతన బార్ పాలసీని విడుదల చేసిందన్నారు. బాపట్ల మున్సిపాలిటీ–04 , చీరాల మున్సిపాలిటీ –07, రేపల్లె మున్సిపాలిటీ–04, అద్దంకి నగర పంచాయతీ–01 చొప్పున 17 బార్ ఉన్నాయన్నారు. వీటితోపాటు గీత కులాలకు సంబంధించి బాపట్ల మున్సిపాలిటీ–01, రేపల్లె మున్సిపాలిటీ–01 రెండుతో కలిపి మొత్తం 19 బార్ ఉన్నాయన్నారు. బార్‌లకు కేటాయింపు పాత పద్ధతిలోని వేలం ద్వారా కాకుండా, ఏ–4 షాపులకు జరిపిన విధంగా డ్రా ఆఫ్ లాట్స్ (చీటీలు) ద్వారా జరపబడుతుందన్నారు. డ్రా ఆఫ్ లాట్స్‌లో పాల్గొనే అభ్యర్థులు రూ.5 లక్షల దరఖాస్తు ఫీజును, రూ.10,000 ప్రాసెస్సింగ్ ఫీజును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హైబ్రిడ్ పద్ధతి ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులపై ఎటువంటి పరిమితి లేదని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చన్నారు. దరఖాస్తు సమర్పించేందుకు ఆఖరు తేదీ ఈనెల 26 వరకు గడువు ఉందన్నారు. లైసెన్స్ ఫీజును ఒకేసారి కాకుండా ఆరు సమాన వాయిదాల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. నూతన బార్ పాలసీ ద్వారా బార్‌ల టైమింగ్స్ అదనంగా మూడు గంటలు పొడిగించి, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్‌లు నడుపుకునేందుకు ప్రభుత్వం సడలింపు చేసిందన్నారు.