
జిల్లా అంబులెన్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రారం
గుంటూరు రూరల్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా అంబులెన్‌న్స్ డ్రైవర్స్–వర్కర్స్ యూనియన్‌ను శుక్రవారం ప్రారంభించారు. జాతీయ జెండాను ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ శివాజీ, సీఐటీయూ జెండాను ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు టీవీజీ రవిశంకర్, గుంటూరు జిల్లా అంబులెన్‌న్స్ డ్రైవర్స్ –వర్కర్స్ యూనియన్ బోర్డును యూనియన్ గౌరవాధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి ఆవిష్కరించారు. శివాజీ మాట్లాడుతూ ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ దేశవ్యాప్తంగా రవాణా కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్న అంబులెనన్స్ డ్రైవర్లను అభినందించారు. ఆటోలు, అంబులెనన్స్, ఇతర రవాణా కార్మికులకు ప్రభుత్వమే పార్కింగ్, వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ అంబులెనన్స్ డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి శంకర్‌రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలుగా కార్మికులపై భారాలు మోపుతున్నాయన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ గుంటూరు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కట్లకుంట శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, నగర నాయకులు షేక్ ఖాసీం వలి, ఆది నికల్సన్, షేక్ ఖాసిం షహీద్, దొడ్డా కోటేశ్వరరావు, యూనియన్ నాయకులు షేక్ బాషా, ఈసూబ్, వాజిద్, ప్రేమ్ కుమార్, పాల్గొన్నారు.