జాతీయ రహదారిపై తిరగబడ్డ కారు
ఇరువురికి గాయాలు
జె.పంగులూరు: మండల పరిధిలోని అలవలపాడు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు నుంచి బిహార్ వెళుతున్న టీఎస్ 73 ఏసీ 5344 నంబరు గల కారు ముందు టైరు ఫంక్చర్ కావడంతో రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మలను ఢీకొని బోల్తా పడింది. సోమవారం అలవలపాడు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ సంఘటనలో కారు నడుపుతున్న జీ మురళీధరన్ (వేలూరు)తోపాటు అందులో ప్రయాణిస్తున్న శశికళ అనే మహిళకు గాయాలయ్యాయి. సమాచార తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. రోడ్డుపై పడిపోయిన కారును మార్జిన్‌లోకి తరలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.


