కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
చేబ్రోలు: కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమదవశాత్తూ బ్రిడ్జి సైడ్‌వాల్‌ను వేగంగా ఢీ కొట్టడంతో తల్లిదండ్రులతోపాటు వధువు అన్నకు గాయాలైన ఘటన చేబ్రోలులో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పొన్నూరు రూరల్ మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన రోహా, రాధిక దంపతులు తమ కుమార్తెను తాడికొండకు చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహాం అనంతరం భార్యభర్తలు, తమ కుమారుడు నవీన్ కుమార్‌రెడ్డితో కలిసి తాడికొండ నుంచి కారులో స్వగ్రామానికి గురువారం బయలు దేరారు. నవీన్‌కుమార్‌రెడ్డి కారు నడుపుతున్నాడు. చేబ్రోలులోని సినిమాహాలు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన సైడ్ వాల్‌ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు బాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురికీ ముఖానికి, కాళ్లు, చేతులు, నడుంకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనం ద్వారా క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
వధువు అన్నకు కూడా..
చేబ్రోలులో అదుపుతప్పిన కారు
కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం


