బాపట్ల
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కార్యదర్శులకు
● జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలకు రెక్కలు
● జోరుగా అక్రమ లే అవుట్‌లు ● గ్రామ పంచాయతీ కార్యదర్శలు భారీగా అవినీతి
● జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారుల సహకారం
వేటపాలెం: జాతీయ రహదారి నిర్మాణంతో తీర ప్రాంత గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జాతీయ రహదారికి ఇరువైపులా భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. ఏకంగా ఎకరం రూ.2 కోట్లు పైనే పలుకుతుంది. సముద్ర తీర గ్రామలైన రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాలలో పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందింది. దీనితో ఆయా గ్రామాలలో ఏకంగా ఎకరం దాదాపు రూ.ఏడు కోట్లు పలుకుతుంది. దీంతో అక్రమ లే అవుట్‌లు విచ్చలవిడిగా వెలిశాయి. ఇది పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. లే అవుట్‌లు, భవన నిర్మాణాలకు ఫిక్స్‌డ్ ధర నిర్ణయించి వసూళ్లు ఆరంభించారు.
అనుమతి లేని లే అవుట్‌లు..
సముద్ర తీరం వెంట రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో లేఅవుట్‌లు వెలశాయి. వీటితోపాటు 50 వరకు రిసార్ట్‌ల నిర్మాణాలు జరిగాయి. 216 జాతీయ రహదారి ఇరువైపుల పంట పొలాలు, అసైడ్ భూముల్లో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్‌లు వెలిశాయి. ఇవి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రధానంగా పాపాయపాలెం, అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం గ్రామాల పరిధిలో వంద సంఖ్యలో అనుమతి లేని లేఅవుట్‌లు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ కార్యాదర్శులు అక్రమ లేఅవుట్లకు, అక్రమ భవన నిర్మాణాలకు ధర నిర్ణయించి వసూలు చేసుకుంటున్నారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరం వద్ద అక్రమ లేఅవుట్‌లకు గరిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, ఎటువంటి అనుమతులు లేకుండా రిసార్ట్‌ల నిర్మాణానికి రూ.2 లక్షలు, విద్యుత్ మీటర్ మంజూరుకు ఇచ్చే అనుమతి ఎన్వోసీకి రూ.5 నుండి రూ.10 వేలు ధర నిర్ణయించినట్లు సమాచారం. ప్లాన్ ఇవ్వకుండా భవనాలు నిర్మించుకుంటున్న వారి వద్ద భవనం నిర్మాణాన్ని బట్టి రూ.20 వేలు ధర నిర్ణయించారు. కొత్త భవనాలకు ఆస్తి పన్నులు విధింపునకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అవినీతిపరులైన కొందరు మండల, డివిజనల్ పంచాయతీ అధికారులు కార్యదర్శులు ప్రతి నెలా ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదు.
నోటు కొట్టు. ఎన్వోసీ పట్టు
చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో కొత్తగా భవనం, రేకుల షెడ్డు, వ్యాపార సంస్థ, బంకు ఏర్పాటు చేసుకున్నా సరే దానికి విద్యుత్ మీటరు కోసం కార్యదర్శిఽ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. కార్యదర్శి చేయి తడిపితే చాలు ఎలాంటి నిబంధనలు లేకుండానే ఎన్‌ఓసీ జారీ చేస్తున్నారు. పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు భూములు, పంట పొలాల్లో కట్టడాలు కట్టుకున్నా సరే డబ్బులు తీసుకుని ఎన్‌ఓసీ జారీ చేస్తున్నారు. అక్రమ లేవుట్, రోడ్డు మార్జిన్, పంట పొలాల్లో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని విద్యుత్ మీటరు కావాలంటే ఎన్‌ఓసీ కావాలి. కార్యదర్శికి రూ.2 వేలు నుంచి రూ.5 ఇస్తే చాలు ఎన్‌ఓసీ ఇచ్చేస్తారు.
విచారణ చేస్తాం
ఆరోపణలు వచ్చిన కార్యదర్శులపై విచారణ చేస్తాం. ఆరోపణలు నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ, వేటపాలెం
9
న్యూస్‌రీల్
కొత్తపేట కార్యదర్శి ప్రత్యేకం
కొత్తపేట పంచాయతీ చీరాల మున్సిపాలిటీలో కలసి ఉంటుంది. కానీ పంచాయతీగానే కొనసాగుతుంది. సంపన్నులు ఎక్కువగా ఈ పంచాయతీ పరిధిలోనే ఉంటుంటారు. ఈ పంచాయతీ కార్యదర్శి దాదాపు నాలుగేళ్లగా ఇక్కడే కొనసాగుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేటపాలెం మండలం పరిధిలోని అందరు కార్యదర్శులను బదిలీ చేశారు. కానీ కొత్తపేట కార్యదర్శి మాత్రం బదిలీ కాలేదు. రాజకీయ నాయకులకు రూ.20 లక్షలు వరకు ముడుపులు ఇచ్చి బదిలీ ఆపుకున్నట్లు బహిరంగ గానే చర్చ జరిగింది. మండల పరిధిలోని ఏ కార్యదర్శిపైనా రాని విధంగా ఇతనిపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లు ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
కాసుల వర్షం
కాసుల వర్షం
కాసుల వర్షం
కాసుల వర్షం
కాసుల వర్షం
కాసుల వర్షం
కాసుల వర్షం


