కీబోర్డులో గిన్నిస్ రికార్డు
పెదకాకాని: మ్యూజికల్ కీ బోర్డులో కొప్పురావూరుకు చెందిన ఉషారాణి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకుంది. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు గ్రామానికి చెందిన టి.ఉషారాణి స్ఫూర్తి మహిళా సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2024 డిసెంబరు 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ గంట సమయం పాటు 17 దేశాలకు చెందిన 1090 మంది ఒకే టైమ్‌లో నాన్‌స్టాప్‌గా కీ బోర్డు ప్లే చేయడం జరిగింది. ఈ వీడియో రికార్డును నాస్టర్ అగస్టీన్ దండంగి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వీడియోను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ వారు కొప్పురావూరుకు చెందిన టి.ఉషారాణిని గిన్నిస్‌బుక్ రికార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మణికొండలో నిర్వహించిన కార్యక్రమంలో అగస్టీన్ దండంగి, బ్రదర్ అనిల్ కుమార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్‌ల చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్‌ను టి.ఉషారాణికి అందజేశారు.


