● జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి
● చినగంజాం మండలం
కొత్తగొల్లపాలెం సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
● ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లును
పరిశీలించిన అధికారులు
చినగంజాం: ఏప్రిల్ 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ చినగంజాం మండలం కొత్తగొల్లపాలెం గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలు గురువారం సందర్శించారు. కొత్తగొల్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి దిగేందుకు అనుకూలంగా హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. 2 వేల మంది ప్రజలు కుర్చోవటానికి అనుకూలంగా సభాప్రాంగణం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా వేదిక వద్ద రెండు స్టాల్స్‌ని ఏర్పాటు చేయాల్సిందిగా డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సుమారు 4 గంటలపాటు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓలు తోట చంద్రశేఖర్ నాయుడు, రామలక్ష్మి, గ్లోరియా, చినగంజాం తహసీల్దార్ జీవిగుంటు ప్రభాకరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.


