పంచాయతీల విభజనకు
న్యూస్‌రీల్
అటు అధికారులకు, ప్రజలకు సమస్యగా మారిన వైనం దళితవాడలను ప్రధాన గ్రామ పంచాయతీల నుంచి విభజన అధికార పార్టీ స్వలాభం కోసమే విభజన అంటున్న పలువురు
మార్టూరు, యద్దనపూడి, పర్చూరుమండలాల్లో..
యద్దనపూడి మండలంలో యనమదల పంచాయతీని యనమదల (2428), చింతపల్లిపాడు (1671) పంచాయతీలుగాను,
పర్చూరు మండలంలో చెరుకూరు పంచాయతీని చెరుకూరు(6077), ఉప్పరపాలెం (262), గోరంట్ల వారిపాలెం పంచాయతీని గోరంట్ల వారిపాలెం(315), గర్నెపూడి(503), ఎడారిపల్లె (657)గాను విభజించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
చినగంజాం మండలంలో..
చినగంజాం పంచాయతీని చినగంజాం (3788), సోపిరాల (2736) పూలవారిపాలెం (297) కలిపి సోపిరాల పంచాయతీ (3033)గాను,
పెదగంజాం పంచాయతీని మూడు పంచాయతీలుగా పెదగంజాం, బుచ్చిగుంట, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలను పెదగంజాం పంచాయతీ (4118)గాను,
పల్లెపాలెం, ఏటిమొగ, ఎస్సీ కాలనీలను పల్లెపాలెం పంచాయతీ (971)గాను,
కాటంవారిపాలెం, కోడూరివారిపాలెం, కొత్తగొల్లపాలెం, పాత గొల్లపాలెంలను కొత్తగొల్లపాలెం పంచాయతీ(3211)గాను,
మోటుపల్లి పంచాయతీలో మోటుపల్లి, కృష్ణనగర్, నిరీక్షణగిరి, రుద్రమాంబపురం, సీతారాంపురం, యానాది సంఘంలను కలిపి మోటుపల్లి పంచాయతీ(1894)గాను,
అడివీధిపాలెం, జీడి చెట్లపాలెం, కుంకుడు చెట్లపాలెం గ్రామాలను కలిపి అడివీధిపాలెం పంచాయతీ (2146)గాను,
కొత్తపాలెం పంచాయతీలో కొత్తపాలెం, భాగ్యనగర్, సత్తాయి మాలపల్లె, రైల్వేసెంటర్, శాంతి నగర్‌లను కలిపి కొత్తపాలెం పంచాయతీ(2964)గాను పంచాయతీ నుంచ రామచంద్రనగర్ (871)ను వేరు చేసి పంచాయతీగా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు.
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పర్చూరు(చినగంజాం): కొన్ని నెలల్లో పంచాయతీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీల విభజన అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వం పంచాయతీల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీలను ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాల మేరకు విభజన చేపట్టాలంటూ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని అధికారులు విభజనకు సంబంధించిన అంశాలను నివేదిక తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. ఎక్కువ పంచాయతీలను విభజించే విధంగా ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు సిఫార్సుల మేరకు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్‌లకు ప్రతిపాదనలు అందజేయడంతో వాటిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
దానికి సంబంధించి ఆయా పంచాయతీల తీర్మానాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలను పరిగణలోకి తీసుకునే పనిలో అధికారులు తలమునకలువుతున్నారు.
ఇంకొల్లు మండలంలో..
ఇంకొల్లు పంచాయతీని ఇంకొల్లు (13935) హనుమోజీపాలెం (1132), గొల్లపాలెం (888) పంచాయతీలుగా విభజించేందుకు ప్రతిపాదనలు చేశారు. గంగవరం పంచాయతీని గంగవరం (2263), తాటిపర్తివారిపాలెం (686)గాను, ఇడుపులపాడు పంచాయతీని ఇడుపులపాడు(5036), అంకిరెడ్డిపాలెం(600), ఇడుపులపాడు ఎస్సీ కాలనీ (1800)గాను,
సూదివారిపాలెం పంచాయతీని సూదివారిపాలెం (730), ఇడుపులపాడు పంచాయతీలోని అంబటిపాలెం (350)ని కలిపి సూదివారిపాలెం పంచాయతీ (1080)గా ఏర్పాటు, కొణికి పంచాయతీని కొణికి (1800), కొణికి పల్లె (1100)గాను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మార్టూరు మండలంలో నాగరాజుపల్లి పంచాయతీని నాగరాజుపల్లి(2631), నాగరాజుపల్లి తండా, ఎస్సీ కాలనీ కలిపి నాగరాజుపల్లి తండా పంచాయతీ(1561)గాను,
పంచాయతీల విభజనకు


