నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాపట్లకు రాక
బాపట్ల: బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరంలో జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సమీక్షిస్తారని
తెలిపారు.
పిడుగురాళ్ల: రైతులకు ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అన్ని పంటలపై సమగ్ర విజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుంటూరు లాంఫాం క్షేత్ర సందర్శన నిమిత్తం సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జీవన ఎరువుల ఉపయోగం, వినియోగం గురించి వివరించటం, విత్తన ఉత్పత్తి, మిరపలో తామర పురుగుల నివారణ, పుట్టగొడుగుల సాగు, ఆయిల్‌ఫామ్ సాగు, అపరాల సాగు విధానం, డ్రోన్ ఉపయోగం గురించి వివరించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఎం.సంధ్యారాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు ఉన్నారు.
గుంటూరువెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వాన్నంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలపై పేరుకుపోవడంతో పంటలు దుమ్ము కొట్టుకొని పనికిరాకుండా పోతున్నా యని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు.
నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాపట్లకు రాక


