
ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా క
నెహ్రూ నగర్(గుంటూరు ఈస్ట్): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా మార్పు కోటయ్య ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కల్యాణమండపంలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షులుగా మైల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి.కొండలరావు, కె.రజని, జనరల్ సెక్రెటరీగా ఎం.లక్ష్మణరావు, జాయింట్ సెక్రెటరీగా ఆర్.కోటేశ్వరరావు, పాతపాటి రమేష్, ట్రెజరర్‌గా సి.హెచ్.అనూష, ప్రెస్ సెక్రటరీగా ఎం. కోటేశ్వరరావు, పి.రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సి.హెచ్.ఆంజనేయులు, ఎన్.రవిశంకర్, కోటి శ్రీనివాసరావు, జె.విమలను ఎన్నుకున్నట్టు వివరించారు. కొత్తగా ఎన్నికై న కమిటీని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి అభినందించారు.
న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.6 లక్షలకు పెంపు
గుంటూరు లీగల్: న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో న్యాయవాదులు అనారోగ్యానికి గురైప్పుడు రూ.లక్ష ఉన్న మెడికల్ బెనిఫిట్స్ రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు తీర్మానించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. యాక్సిడెంట్ డెత్ జరిగితే బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్‌తో సంబంధం లేకుండా రూ.5 లక్షలు ఇచ్చే విధంగా తీర్మానించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించింది.
ముస్లింలను వంచించిన కూటమి ప్రభుత్వం
నాదెండ్ల: ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం మద్దతునివ్వడం అన్యాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని ద్రోహం చేశారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి మోసం చేసిందని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్‌కుమార్ మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు బహిరంగ ప్రకటన చేయడం ముస్లింలపై వారికున్న కపట ప్రేమను తేటతెల్లం చేసిందని తెలిపారు. ముస్లింలకు అండగా నిలుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై చిత్తశుద్ధి ప్రకటించకపోతే భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా క