బాపట్ల: ప్రాణ త్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవం స్థానిక పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల ఆవరణలో ఆదివారం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అధికారులు, పుర ప్రముఖులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరాములు పోరాటపటిమను, ప్రాణత్యాగాన్ని కీర్తించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డీఈఓ పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ, జిల్లా అధికారులు, టిడిపి నాయకులు రామసుబ్బారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకట మురళి