ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Telugu Horoscope On Aug 17th To Aug 23rd, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Aug 17 2025 5:50 AM | Updated on Aug 17 2025 11:57 AM

Weekly Horoscope In Telugu From 17-08-2025 To 23-08-2025

మేషం...
చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు. సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు  మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.

వృషభం...
వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఆసక్తికర సమాచారం తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం....
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు పొందే వీలుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేతనీలం రంగులు. గణేశాష్టకం పఠించండి

కర్కాటకం...
చేపట్టిన వ్యవహారాలు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వివాదాలు. మానసిక అశాంతి.  తెలుపు, పసుపు రంగులు.  శివపంచాక్షరి పఠించండి.

సింహం....
కొత్త పనులు విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు.  ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో   అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాస్తోత్రాలు  పఠించండి.

కన్య....
మిత్రులతో వివాదాలు పరిష్కారం.  శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా  చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో  అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. సాంకేతిక వర్గాలు, రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. వారం ప్రారంభంలో  కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

తుల....
ఏ పని ప్రారంభించినా వెనుదిరగక పూర్తి చేస్తారు.  పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి.M ఉద్యోగాలలో నిరాశ నుండి  బయటపడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అన్నింటా విజయాలు.  వారం ప్రార ంభంలో ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. నేరేడు, తెలుపు. రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం....
వ్యవహారాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సేవాకార్యక్రమాలు విరివిగా చేపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు ‡ తీరతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.  కుటుంబసభ్యుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు, సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి పెట్టుబడులు పెంచుతారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం రాగలదు. కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
దృఢదీక్షతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు కేసుల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ   బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

మకరం....
అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత విముక్తి లభిస్తుంది. సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం....
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. చేపట్టిన  వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. కళారంగం వారు, క్రీడాకారులకు సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం...
కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితుల ప్రభావం నుండి కొంత బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి  గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఏ బాధ్యత అప్పగించినా  వెనుకడుగు వేయరు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన, వివాదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement