గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.6.40 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.38 నుండి 1.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు, అమృత ఘడియలు: రా.10.11 నుండి 11.56 వరకు, మాస శివరాత్రి.
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృషభం..... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. పనుల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
మిథునం.... కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కర్కాటకం.... రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం.... కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య.... పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
తుల.... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
వృశ్చికం... ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
ధనుస్సు.... ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన సమాచారం. విందువినోదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
మకరం.... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. కార్యజయం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కుంభం.... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
మీనం.. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.


