గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: అమావాస్య ఉ.10.36 వరకు,నక్షత్రం: విశాఖ ఉ.10.24 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.2.50 నుండి 4.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: రా.1.30 నుండి 3.14 వరకు.
సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
వృషభం.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
మిథునం.... దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. కార్యజయం. కొన్ని వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.
కర్కాటకం..... వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
సింహం.... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.
కన్య.... పలుకుబడి పెరుగుతుంది. కార్యజయం. బంధువుల నుంచి సహాయం. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
తుల..... పనులు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు..... వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ దర్శనాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
మీనం.... మిత్రులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.


