Horoscope Today: Telugu Rasi Phalalu On 08-05-2022 - Sakshi
Sakshi News home page

May 8th Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

May 8 2022 6:19 AM | Updated on May 8 2022 12:37 PM

Today Horoscope 08-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.సప్తమి ప.12.49 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం పుష్యమి ప.11.32 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.1.12 నుండి 2.56 వరకు, దుర్ముహూర్తం సా.4.34 నుండి 5.25 వరకు, అమృతఘడియలు... ఉ. 4.11 నుండి 6.07 వరకు.

సూర్యోదయం        :  5.35
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు..

మేషం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. భూలాభం.

సింహం: బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కన్య: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement