గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.షష్ఠి రా.9.04 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: మఖ ప.2.58 వరకు తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.10.52 నుండి 12.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.30 నుండి 7.14 వరకు, అమృత ఘడియలు: ప.12.37 నుండి 2.10 వరకు
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కర్కాటకం: ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సింహం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
కన్య: వ్యవహారాలలో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
తుల: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభాపాటవాలకు గుర్తింపు రాగలదు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. రావలసిన సొమ్ము అందుతుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.


