ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం | Today Telugu Horoscope On June 17th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

Jun 17 2026 3:11 AM | Updated on Jun 17 2026 8:47 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ రా.2.09 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పునర్వసు సా.6.00 వరకు, తదుపరి పుష్యమి,వర్జ్యం: ఉ.6.45 నుండి 8.15 వరకు, తదుపరి రా.1.34 నుండి 3.05 వరకు, దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.26 వరకు,అమృత ఘడియలు: ప.3.44 నుండి 5.13 వరకు.

సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం...  ఉత్సాహంగా పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

వృషభం..  పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం....  పనులలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం..  ఆదాయానికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం....  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.

కన్య...  కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

తుల....  మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

వృశ్చికం...  అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు..  దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ముందడుగు వేస్తారు.

మకరం....  పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం..  కార్యక్రమాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం....  కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement