నేటి నుంచి విశాఖలో త్రిసభ్య కమిటీ పర్యటన

విశాఖపట్నం: నీతి అయోగ్‌ గ్రోత్‌ హబ్‌ సిటీ, రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీల­నకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం సోమవారం నుంచి విశాఖలో క్షేత్ర­స్థాయిలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పుర­పాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. విశాఖలో సీఎం జగన్‌ పర్య­టన నేపథ్యంలో రుషి­కొండలోని ఐటీ హిల్స్‌­లో ఏర్పాట్లను ఆయన ఆదివారం తనిఖీ చేశారు.

మీడి­యా­తో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లతో ఓ బృందాన్ని నియ­మించిందని ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించిందనీ.. క్షేత్రస్థాయిలో పర్య­టించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుందని తెలిపారు.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top