సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్మన్ ఎన్నిక శుక్రవారం జరగనుంది. స్థానిక బెంగళూరు రోడ్డులోని కొత్త జెడ్పీ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తగా ఎన్నికై న జడ్పీటీసీలు హాజరుకానున్నారు. ఈనెల 5న జిల్లా పరిషత్‌త్ ఎన్నికల్లో టీడీపీ 18, బీజేపీ ఒకటి (వీటిలో మూడింటిని టిడిపి ఏకగ్రీవం చేసుకుంది) దక్కించుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆరు జెడ్పీటీసీలు దక్కాయి. ఈ కొత్త జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యాక జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు.
జల సంరక్షణ విధానాలపై సమీక్ష
రాయచోటి : జిల్లాలో తక్కువ వ్యయంతో ప్రణాళిక బద్దంగా చేపట్టిన జల సంరక్షణ, నీటి వనరుల పునరుజ్జీవన కార్యక్రమాలు వ్యవసాయ అభివృద్ధికి, భూగర్భజలాల పెంపునకు విశేష ఫలితాలను అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కేంద్ర బృంద సభ్యులతో పేర్కొన్నారు. జిల్లాలో జల సంరక్షణ, నీటి వనరుల పునరుజ్జీవనం, భూగర్భజలాల పెంపు, సమగ్ర వాటర్ షెడ్, అభివృద్ధి, వ్యవసాయ రంగంలో నీటి పొదుపు విధానాల అమలును క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కేంద్ర జల సంఘం బృందం సభ్యులు, ఈఈలు చరణ్, ప్రణితులతో గురువారం సాయంత్రం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం, వాటర్ రీసోర్స్‌స్ శాఖ ఎగ్జిక్యూటీవ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరామయ్య, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


