తంబళ్లపల్లె: తంబళ్లపల్లె ఎంపీపీగా కన్నెమడుగు ఎంపీటీసీ సభ్యురాలు దేవరింటి లీలావతి, వైస్ ఎంపీపీగా ఎద్దులవారిపల్లె ఎంపీటీసీ సభ్యురాలు వై.భూదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్ఓ శ్రీధర్,ఎంపీడీఓ ఉషారాణి,తహశీల్దార్ శ్రీనివాసులు గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎంపిక నిర్వహించారు. మొదట పది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు లీలావతి, సుశీలమ్మ, భూదేవి, గాయత్రి, అంజనమ్మ, రెడ్డిమల్రెడ్డి, రవీంద్రనాయక్, హరికుమార్‌రెడ్డి, నరసింహులు, భాస్కర్‌నాయుడు, ఒకే ఒక టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు ప్రమీలమ్మల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు రెడ్డిమల్ రెడ్డి, హరికుమార్రెడ్డిలు ఎంపీపీ అభ్యర్థిగా డి.లీలావతి, వైస్ ఎంపీపీలుగా భూదేవిలను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతన ఎంపీపీగా డి.లీలావతి, వైస్ ఎంపీపీగా భూదేవిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తనయుడు అభినయ్‌రెడ్డి, నూతన జెడ్పీటీసీ సభ్యులు సందప్పలు కార్యక్రమానికి హాజరై వారికి అభినందనలు తెలిపారు.
19టీబీపీ 31ఎః
ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తనయుడు అభినయ్‌రెడ్డి


