పీలేరు రూరల్ : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సమన్వయ అధికారి టి. పద్మజ అన్నారు. గురువారం స్థానిక బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. ఎస్‌ఏ–1 పరీక్షలను పరిశీలించారు. వంట గదిని, ఆహార పదార్థాలు, సరుకులు నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో కిచెన్ గార్డెన్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకళ, వైస్ ప్రిన్సిపాల్ నిరంజని తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ క్రీడాకారులకు 16న జిల్లాస్థాయి ఎంపికలు
మదనపల్లె సిటీ: దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసేందుకు ఈనెల 16న జిల్లా స్థాయి పారా స్పోర్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీలు రాయచోటిలోని నక్కవాడిపల్లెలో డీఎస్‌డీఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. పురుషులు, మహిళలు వేర్వేరుగా పారా అథ్లెటిక్స్ , పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్, ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో,పారా టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 13 ఏళ్లు పైబడిన దివ్యాంగులు పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు మస్తాన్ 73869 01200, చంద్రశేఖర్ 91547 31106ను సంప్రదించాలన్నారు.
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత : కలెక్టర్, ఎస్పీ
సాక్షి మదనపల్లె: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారు ఈ మేరకు జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు భయం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ కోరారు.


