బి.కొత్తకోట: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా, 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. చైర్మన్ పదవిని బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రకటనతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. బ్రిటిష్ పాలనలో ఏర్పడిన బి.కొత్తకోట పంచాయతీకి 120 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 2021 జనవరిలో మేజర్ పంచాయతీగా ఉన్న దీనిని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆ తర్వాతి వారం నుంచే కమిషనర్ పాలన మొదలైంది. అయితే, నగర పంచాయతీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇన్నాళ్లూ ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా కోర్టు కేసు ఉపసంహరణ కావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
చైర్మన్ రిజర్వేషన్ : బీసీ జనరల్
మొత్తం ఓటర్లు : 21,881 మంది
ఎస్టీ జనరల్ (1) : 2వ వార్డు
ఎస్సీ మహిళ (1) : 6వ వార్డు
ఎస్సీ జనరల్ (1) : 7వ వార్డు
బీసీ మహిళ (4) : 13, 14, 15, 20
బీసీ జనరల్ (4) : 16, 17, 18, 19 మహిళ జనరల్ (6) : 3, 4, 8, 9, 10, 21 వార్డులు
అన్‌రిజర్వ్‌డ్ / జనరల్ (6): 1, 5, 11, 12, 22, 23 వార్డులు
14న ప్రక్రియ ప్రారంభం
26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
బీసీ జనరల్‌కు చైర్మన్ పీఠం రిజర్వ్
కోర్టు కేసు ఉపసంహరణతో
తొలగిన అడ్డంకులు
నగర పంచాయతీ స్వరూపం
ఎన్నికల షెడ్యూల్ (నవంబర్ 2026)


