● 3 ఎంపీపీ, 3 జెడ్పీటీసీ కై వసం
● మరిన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ముందంజ
సాక్షి, మదనపల్లె : జిల్లాలో ఈనెల 5న జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిన ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా కొనసాగుతోంది. శనివారం మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు రాత్రి 12 గంటల దాకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కుట్రలు, కుతంత్రాలతో, అధికార అండతో హింస ద్వారా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న మండలాల్లో టీడీపీ, దాని కూటమి పార్టీలు, ఎన్నికల్లో ప్రజా మద్దతుతో కాకుండా ఏకగ్రీవం పేరుతో బలం పెంచుకుంది. అయితే వైఎస్‌ఆర్‌సీపీకి జిల్లాలో బలం, ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపితమవుతోంది.
● జిల్లాలోని రాయచోటి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు ఏకగ్రీవాలు చేసుకున్నారు. మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటుతోంది. అర్ధరాత్రి సమయానికి సదుం, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండల పరిషత్తులు పూర్తిగా వైఎస్‌ఆర్‌సీపీ కై వసమయ్యాయి. మూడు జెడ్పీటీసీలు గెలిచారు.
ఏకపక్షంగా కై వసం..
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలమైన సదుం వైఎస్‌ఆర్‌సీపీ వశమైంది. మండలంలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో అమ్మగారిపల్లె, బూరగ మంద, చెరుకువారిపల్లె, కంభంవారిపల్లె, పాలమంద, యర్రాతి వారిపల్లె, సదుం, తిమ్మనాయునిపల్లె ఎంపీటీసీ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కన్నెమడుగు, కొటాల, గుండ్లపల్లి, కోసువారిపల్లి, తంబళ్లపల్లె, ఎద్దుల వారికోట, పరసతోపు, కోటకొండ, కుక్కరాజు పల్లి, బాలిరెడ్డిగారి పల్లి ఎంపీటీసీ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా ఏకపక్షంగా ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. అలాగే పెద్దమండ్యం మండలంలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో వెలిగల్లు, శివపురం, ఎన్‌ఓపల్లి, కలిచర్ల, కోటకాడపల్లి, పాపేపల్లి, సి గొల్లపల్లి, పెద్దమండ్యం ఎంపీటీసీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది.
అడ్డుకున్నా విజయం..
పీలేరు, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ హింస, అరాచకంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే నామినేషన్లు దాఖలు చేసిన, గుర్రంకొండ మండలంలో జరిగిన నాలుగు ఎంపీటీసీ ఎన్నికల్లో గుర్రంకొండ– 1 ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన షకీరా గెలుపొందారు. అలాగే వాల్మీకిపురంలో 11 స్థానాలు టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా రెండు స్థానాలకు ఎన్నిక జరిగితే ఒక స్థానమైన మూడేవాళ్ళపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సుహాసిని విజయం సాధించారు. పీలేరు మండలంలో 21 ఎంపీటీసీల్లో 20 స్థానాలను టీడీపీ కుట్రలతో కై వసం చేసుకుంది. మిగిలిన పీలేరు–7 స్థానంలో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రత్నశేఖర్ రెడ్డి 800 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పుంగనూరులో 16 స్థానాలకు ఐదు ఏకగ్రీవం చేసుకోగా 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నాలుగు ఎంపీటీసీలను గెలుచుకున్నారు. అలాగే విడుదలైన ఓట్ల ఫలితాలు మేరకు.. రామసముద్రంలో ఏడు, పీటీఎంలో ఐదు, కురబలకోటలో మూడు, బి.కొత్తకోటలో నాలుగు, మదనపల్లి మండలంలో బొమ్మనచెరువు, చీకలబైలు, పెంచుపాడు, తట్టివారిపల్లి, దుబ్బి గానిపల్లి, కొత్త ఇండ్లు–1, కొత్తవారి పల్లె, మరికొన్ని ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. మిగిలిన స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. నిమ్మనపల్లి మండలంలో నిమ్మనపల్లె, బండ్లపై, కొండయ్య గారి పల్లె, వెంగవారిపల్లె, రెడ్డివారిపల్లె ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలిచినట్లు సమాచారం.
అందుకే అడ్డంకులు..
జిల్లాలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ లను ఎన్నికల్లో స్వేచ్ఛగా తిరగనిస్తే తమ ఉనికికే ప్రమాదమని టీడీపీ అడుగడుగునా అడ్డంకులతో హింసతో అరాచకాన్ని సృష్టించింది. పుంగనూరులో అరాచకం ద్వారా భయభ్రాంతులను సృష్టించి ఎన్నికలకు దూరం చేయాలని పన్నాగం పన్నింది. అయితే పుంగనూరులో ఎన్నికలు జరిగితే నాలుగు ఎంపీటీసీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకోవడం చూస్తే.. పుంగనూరులో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతుంది. ఇంత నిర్బంధం, అరాచకం మధ్య వైఎస్‌ఆర్సీపీ విజయ బావుటా ఎగురవేసింది.
మదనపల్లె కేంద్రంలో ఓట్లను వేరు
చేస్తున్న సిబ్బంది
మదనపల్లె కౌంటింగ్ కేంద్రంలోని బ్యాలెట్
బాక్సులను తీసుకొస్తున్న సిబ్బంది


