రసవత్తరంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా క్రికెట్‌ టోర్నమెంట్‌

Nov 8 2026 1:01 AM | Updated on Nov 8 2026 1:01 AM

వాల్మీకిపురం : స్థానిక సీడీసీఏ, జీవీఎస్సీఎస్‌ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌ 14 బాలుర మల్టీడే అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ రసవత్తరంగా జరుగుతోంది. గ్రౌండ్‌ 2 క్రీడా మైదానంలో శనివారం జరిగిన మూడవ రౌండ్‌ మ్యాచ్‌లో చిత్తూరు, అనంతపురం జిల్లా క్రికెట్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అనంతపురం జట్టు 90 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 497 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో అనంతపురం బ్యాట్స్‌మెన్‌ హేమచంద్రనాయక్‌ 223 బంతుల్లో 228 పరుగులతో సత్తా చాటి డబుల్‌ సెంచరీ నమోదు చేశారు. అలాగే బురాసుద్దీన్‌ 186 బంతుల్లో 155 పరుగులు చేసి సెంచరీ నమోదు చేయడంతో 497 భారీ స్కోర్‌ను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో చిత్తూరు క్రికెట్‌ జట్టు బౌలర్‌ భువన్‌సాయి 47 పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లను తీసుకున్నారు. అలాగే గ్రౌండ్‌ 1లో జరిగిన ఇన్నింగ్స్‌లో నెల్లూరు, కడప జిల్లా క్రికెట్‌ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెల్లూరు జట్టు 46.5 ఓవర్లలోనే 124 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కడప జట్టు బ్యాట్స్‌మెన్‌ మానస్‌నందన్‌ 135 బంతుల్లో 112 పరుగులు నాటౌట్‌గా సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించే దిశగా దూసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీఏ ప్రెసిడెంట్‌ శ్రీనివాసమూర్తి, సెక్రటరీ సతీష్‌ కుమార్‌ యాదవ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌కుమార్‌, ఏసీఏ రాష్ట్ర అబ్జర్వర్లు రవిచలం, విష్ణువర్థన్‌ రెడ్డి, స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ జగదీష్‌, జోన్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులు గ్రౌండ్‌ ఇంచార్జ్‌ భరత్‌కుమార్‌, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ హెడ్‌కోచ్‌ సునీల్‌ కుమార్‌, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

135 పరుగులు చేసిన మానస్‌నందన్‌

228 పరుగులు చేసిన హేమచంద్ర నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement