సాక్షి ప్రతినిధి, కడప: కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గిరి ఆట మొదలైంది. అయితే కూటమిలో ఈ పీఠాన్ని దక్కించుకునే ప్రక్రియ ప్రారంభం కావడమే శ్రీఆదిశ్రీలోనే హంసపాదు చందంగా తయారైంది. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలు ఉంటే, అందులో 23 స్థానాలను అధికారుల దండగుల సహకారంతో కూటమి నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. మిగిలిన స్థానాల్లో దౌర్జన్య రిగ్గింగ్‌లతో 14 చోట్ల గెలిచి 37 స్థానాల స్పష్టమైన మెజారిటీని కూటమి దక్కించుకుంది. జనం స్వేచ్ఛగా ఓటేసిన వేముల, వేంపల్లె మండలాల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. అయితే, ఈ 37 స్థానాల బలంతో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో కూటమిలో సరికొత్త అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు కై ్లమాక్స్‌కు చేరి, శ్రీకోట్ల రూపాయలశ్రీబేరసారాల స్థాయికి దిగజారాయి.
జమ్మలమడుగు శ్రీసొంత ఇంటిశ్రీరాజకీయం..భూపేష్‌రెడ్డికి చెక్!
ఈ జెడ్పీ చైర్మన్‌గిరిలో ఎవరి స్వార్థ ప్రయోజనాలు వారికున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయంగా టీడీపీ పగ్గాలు చేపట్టిన తన సొంత సోదరుడి కుమారుడు, టీడీపీ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి పెద్ద అడ్డంకిగా మారారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జమ్మలమడుగులో తనకు తిరుగులేదని భావిస్తున్న ఆదికి, సొంత ఇంటి వ్యక్తే టీడీపీ రూపంలో కంట్లో నలుసుగా తయారయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో భూపేష్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా, తన సొంత సోదరుడి మరో కుమారుడైన రాజేష్‌రెడ్డిని ఆది రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ రేసులోకి రాజేష్‌రెడ్డి పేరును ఆయన వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చారు. నిజానికి వయస్సు రీత్యా, సుదీర్ఘ రాజకీయ అనుభవం రీత్యా జిల్లా వాసులు, టీడీపీ శ్రేణులు కూడా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపుతున్నారు.
రాజేష్‌రెడ్డి కోసం ‘కోట్ల’ఫండ్ ఆఫర్..
లోకేష్ ఎత్తుగడలు!
ఈ పరిస్థితుల్లో పుత్తా నరసింహారెడ్డికి చెక్ పెడుతూ, రాజేష్‌రెడ్డితో సహా బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్‌లతో కలిసి ఆది ప్రత్యేక రహస్య సమావేశం ఏర్పాటు చేయడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ భేటీలో రాజేష్‌రెడ్డికి చైర్మన్‌గిరి ఇస్తే, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో శ్రీపార్టీ ఫండ్‌శ్రీఇస్తానంటూ ఆది కమలనాథులకు ఆశ చూపినట్లు నమ్మదగిన సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల చివరి నిమిషంలో జమ్మలమడుగు అసెంబ్లీ సీటును బీజేపీ ఖాతాలోకి మార్పించుకున్న తరహాలోనే, ఈ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా బీజేపీకి కేటాయించుకునేలా ఢిల్లీ పెద్దలతో కేంద్ర నాయకత్వం ద్వారా ఒత్తిడి తేవాలని ఆది పావులు కదుపుతున్నారు. మరోవైపు, టీడీపీ అధిష్ఠానం సైతం ఈ వ్యవహారంలో కావాలనే నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి శ్రీకమిట్‌మెంట్‌శ్రీకు తగ్గట్లు అన్ని ప్రయోజనాలు, ఫండ్‌లు సమకూరిన తర్వాతే సీటును ఫైనల్ చేయాలనే దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెరవెనుక ఎత్తుగడలు వేస్తున్నట్లు ఆ...పార్టీ శ్రేణులే అంతర్గతంగా వెల్లడిస్తుండటం గమనార్హం. నోటిఫికేషన్ నాటి నుంచి చైర్మన్ కుర్చీపై కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి సీటుకు సొంత కూటమి ఎమ్మెల్యేనే శ్రీడబ్బు సంచులశ్రీ ఎరతో సైంధవ పాత్ర పోషిస్తుండటం జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
జెడ్పీ చైర్మన్‌గిరి కోసం
‘కూటమి’ కుమ్ములాటలు
తెరపైకి ఆదినారాయణరెడ్డి కోట్ల
బేరసారాలు
తన సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి కోసం ‘కోట్ల’ ఫండ్ ఆఫర్
పుత్తా సీటుకు ఎసరు పెట్టిన
జమ్మలమడుగు ఎమ్మెల్యే!
జమ్మలమడుగు ‘సొంత ఇంటి’ శత్రుత్వం
భూపేష్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే
రాజేష్‌రెడ్డితో పొలిటికల్ గేమ్
క్షేత్రస్థాయిలో బలం సున్నా
అయినా ఢిల్లీ పెద్దల అండ కోసం
కమలనాథులతో రహస్య భేటీ
కమిట్‌మెంట్‌కు తగ్గట్లు ప్రయోజనాలు సమకూరాకే ఫైనల్
ఎత్తుగడల్లో మంత్రి నారా లోకేష్!


