కోటలో శిల్ప సంపద చాలా బాగుంది | - | Sakshi
Sakshi News home page

కోటలో శిల్ప సంపద చాలా బాగుంది

Nov 8 2026 1:01 AM | Updated on Nov 8 2026 1:01 AM

సిద్దవటం: సిద్ధపటం కోటలో మండపాలలో రాతి స్తంభాలకు ఉన్న శిల్ప సంపద చాలా బాగుందని కడప జిల్లా జడ్జి రామ్‌గోపాల్‌ పేర్కొన్నారు. సిద్ధవటంలోని మట్లి రాజుల కోటను శనివారం సాయంత్రం జిల్లా జడ్జి కుటుంబ సభ్యులతో కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కోట ముఖ ద్వారం, ఈద్గా, పార్కులు, శిలా శాసనం, మూతి విరిగిన నంది విగ్రహం, తవ్వకాల్లో బయల్పడిన శివలింగం, కామాక్షమ్మ గుడి, టిప్పు సుల్తాన్‌ కాలం నాటి బిస్మిల్లా షావలి దర్గా, రాణి స్నాన వాటిక, రాణి మహల్‌ వంటి కట్టడాలను తిలకించారు. వీటి గురించి గైడ్‌ పాలెం సుబ్బనరసింహులు జడ్జికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోటను అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వం కూడా ఈ మాన్యుమెంట్‌ను అభివృద్ధి చేస్తే పర్యాటకుల హబ్‌ గా మారుతుందన్నారు. అనంతరం ఆయన సిద్ధవటం లోని పాత కోర్టు భవనాలను, బంగ్లాను పరిశీలించారు. కార్యక్రమంలో సిద్ధవటం కోర్టు ఇన్‌చార్జి సివిల్‌ జడ్జి పి కోటేశ్వరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్ర సన్నిధిలో..

బ్రహ్మంగారిమఠం: శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని శనివారం జిల్లా జడ్జి రామగోపాల్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జి కుటుంబ సభ్యులకు మఠం మేనేజర్‌ ప్రసాద్‌, దత్తస్వామి మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామిని జడ్జి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జిని మఠాధిపతి సన్మానించి, మఠం విశేషాలను చర్చించారు.

కడప జిల్లా జడ్జి రామ్‌ గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement