కడప ఎడ్యుకేషన్: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ రేసులో కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కాలేజీ) ఎన్‌సీసీ క్యాడెట్ ఖుషి మహమ్మద్ నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌డీసీ – ఐజీసీ క్యాంప్ బెస్ట్ క్యాడెట్ విభాగంలో ఆమె ప్రథమ స్థానం సాధించి, ముందస్తు గణతంత్ర వేడుకలు (ప్రీ– ఆర్‌డీసీ)కు ఎంపికయ్యారు. శనివారం కళాశాలకు విచ్చేసిన ఖుషి మహమ్మద్‌ను ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య, ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఆర్.నీలయ్య, అధ్యాపక బృందం ట్రోఫీ, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. తమ కళాశాల నుంచి ఒక ఎన్‌సీసీ క్యాడెట్ ఇంతటి ఉన్నత స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఆర్.నీలయ్య, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి హరి ప్రసాద్, అధ్యాపకులు నాగరాజు, శివరామ్, హజరతయ్య తదితరులు పాల్గొన్నారు.


