కడప అగ్రికల్చర్: జిల్లాలోని 58 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సిద్ధం కావాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. శనివారం కడప కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో డివిజనల్ అధికారులతో (డీఎల్‌సీఓ) ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ, త్వరలోనే సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నందున ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత ఎన్నికల ఉత్తర్వులు, నిబంధనలు, సవరణలను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో డివిజనల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


