దీపావళి సందర్భంగా టపాసులు కాల్చేందుకు యువత ఉత్సాహం చూపుతుంది. అయితే టపాసులు కాల్చిన తరువాత వెలువడే పొగ వల్ల మనిషి ఆరోగ్యంపై, ముఖ్యంగా టపాసుల ద్వారా వెలువడే పొగ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతింటుంది. అందువల్ల యువత టపాసులు కాల్చే విషయంలో తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
–డాక్టర్ బి.పురుషోత్తం, ప్రిన్సిపల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజంపేట


