స్థానికేతరుల రౌడీయిజంపై తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

స్థానికేతరుల రౌడీయిజంపై తిరుగుబాటు

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

స్థానికేతరుల రౌడీయిజంపై తిరుగుబాటు

రాజంపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పచ్చనేతలు తీసుకొచ్చిన స్థానికేతరుల రౌడీయిజంపై.. స్థానిక మహిళా ఓటర్లు తిరుగుబాటు చేసిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూటమిపై ఓటర్లలో వ్యతిరేకత పెల్లుబికుంది. ముందుగా పురపాలక సంఘం ఎన్నికల్లో పచ్చ నేతలు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లను తీసుకొచ్చి.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేయడం, అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం తదితర సంఘటనలకు పాల్పడ్డారు. ఇదంతా ఖాకీ కనుసన్నల్లో కొనసాగిన సంగతి తెలిసిందే. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కొనసాగింది.

మహిళా ఓటర్లలో వ్యతిరేకత

రాజంపేట మున్సిపాలిటీ, నందలూరు పరిషత్‌ ఎన్నికల్లో ఓటర్లు కళ్లారా చూశారు. బయటి నుంచి రౌడీలు, గంజాయి బ్యాచ్‌లను.. స్థానికులు ఏకమై పార్టీలతో పని లేకుండా తరిమికొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ ఓటు తామే కాపాడుకోవాలన్నా నినాదంతో మహిళలు సైతం నాన్‌లోకల్‌ గూండాల కళ్లలో కారంకొట్టి, తరిమికొట్టిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదే విధంగా పంచాయతీ సమరంలో కూడా స్థానికులు ఏకమయ్యే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌, నామినేషన్‌ రోజుల్లో నాన్‌లోకల్‌ రౌడీలకు సరైన రీతిలో తిరిగి పంపేందుకు పల్లెవాసులు సిద్ధమవుతున్నారు. ఎవరి ఓటు వారు వేసుకుంటే సరిపోతుంది, బయటి నుంచి జనాలు వచ్చి, తమ ఓటును హరించాలని చూస్తే తప్పకుండా తిరుగుబాటు తప్పదని గ్రామీణ ఓటర్లు హెచ్చరిస్తున్నారు.

ఖాకీల్లో ఆత్మవిమర్శ

పోలీసుశాఖలో చాలా మంది పోలీసులకు ఇది నచ్చలేదు. అయినా బాస్‌ల ఆదేశాలంటూ, తమ కళ్లెదుటే రౌడీలు, గూండాలు, గంజాయి మత్తులో స్వైర విహారం చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం కనిపించింది. ఈ విషసంస్కృతిని రాజంపేటకు తీసుకొచ్చి, చివరికి శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి స్వగృహంపై దాడి చేసే వరకు దారి తీసిందంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు రాయచోటి, సుండుపల్లెతోపాటు ఇతర ప్రాంతాల్లో నుంచి తీసుకొచ్చి.. వారి చేత పచ్చదౌర్జన్యాలు యథేచ్ఛగా జరిగాయి. ఖాకీ డ్రస్‌ వారు తాము ఆత్మవిమర్శ చేసుకోవాలని చెబుతున్నట్లుగా.. వారి ఆవేదన బహిర్గతమవుతోంది.

ఓటర్లతో పనిలేదు...

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఓటర్లతో పనిలేదు. వారి ఓటు అవసరం లేదు. నేరుగా బయటి ప్రాంతాల నుంచి గంజాయి బ్యాచ్‌లు, గూండాలను తీసుకొచ్చి.. స్థానిక టీడీపీ, జనసేన నాయకుల కనుసన్నల్లో రిగ్గింగ్‌, సైక్లింగ్‌ ఇలా చడిచప్పుడు కాకుండా ఓట్లు వేసుకుని, బ్యాలెట్‌ బాక్స్‌లో వేసుకొని వెళ్లిపోతున్నారు. ఈ మధ్యలో వారికి అనుకూలంగా పోలీసు అధికారుల హడావిడి కనిపిస్తోంది. ఇదంతా.. అమ్యామ్యమేనేని ప్రజల నుంచి విమర్శల వెలువడుతున్నాయి. ప్రజాస్వామ్యం అభాసు పాలైందని, తమకు ఓటు వేసుకునే హక్కు లేకుండా కూటమి ప్రభుత్వం హరించి వేసిందన్న అక్కసును వెల్లగక్కుతున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాగేనా!

త్వరలో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాగేనా కొనసాగిస్తారా అన్న అంశం ఇప్పుడు ఓటర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇతర ప్రాంతాల యువకులు, రౌడీలు గంజాయిబ్యాచ్‌లు, అల్లరి మూకలను తీసుకొచ్చి నామినేషన్‌, పోలింగ్‌ రోజుల్లో వీరంగం సృష్టించేలా ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పచ్చనేతలు సిద్ధమవుతారా.. లేక స్థానికంగా వచ్చే తిరుగుబాటుతో వెనకడుగు వేస్తారా అనే అంశంపై ఇప్పడు పల్లె రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బూత్‌ల వద్ద బహిరంగంగానే నాన్‌లోకల్‌ గూండాలు

పోలీసుల సాక్షిగా వీరంగం సృష్టించినా చర్యలేవి?

విష సంస్కృతికి తెరతీసిన ‘పచ్చ’ పార్టీ

బెడిసికొట్టిన వ్యూహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement