ఉపాధ్యాయులతో సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులతో సాధ్యం

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

ఉపాధ్యాయులతో సాధ్యం

దీపావళి సందర్భంగా ముఖ్యంగా పిల్లలు టపాసులను కాల్చేందుకు ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులు కూడా విధిగా వారి కోసం టపాసులు కొనుగోలు చేస్తారు. అయితే టపాసులు కాల్చడం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేయాలి. ఉపాధ్యాయులు చెప్పే మాటల ప్రభావం విద్యార్థులపై ఎంతో ఉంటుంది. చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు చెప్పినా వినరు. ఉపాధ్యాయులు చెప్పేదే కరెక్ట్‌ అని భావిస్తారు. అందువల్ల ఉపాధ్యాయులు హరిత దీపావళి గురించి విద్యార్థులకు బాగా వివరించాలి.

– ఆకేపాటి రజనీకాంత్‌రెడ్డి, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌, రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement