హరిత దీపావళి.. ఆనందాల కేళి | - | Sakshi
Sakshi News home page

హరిత దీపావళి.. ఆనందాల కేళి

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

హరిత దీపావళి.. ఆనందాల కేళి

రాజంపేట టౌన్‌ : దీపావళి వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చీకటిని పారదోలి, జ్ఞానాన్ని పంచి జీవితంపై ఆశలు కల్పించే కాంతుల సందడి. అయితే అనేక మంది దీపావళిని కాలుష్య కారకంగా మార్చేస్తున్నారు. చెవులు బద్దలయే శబ్దాలు, ఊపిరితిత్తులు భరించలేని పొగలను విడుదల చేసే బాణాసంచాలను కాల్చడం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మరొక రోజులోనే దీపావళి పండుగ రానుంది. దీపావళి రోజున టపాసులకు దూరంగా ఉండి.. కొన్నింటిని పాటిస్తే పర్యావరణ హితంగా జరుపుకోవచ్చు.

ఆరోగ్యానికి హానికరం

రకరకాల రసాయనాల మిశ్రమాలతో తయారు చేస్తున్న బాణాసంచాలు అనేక అనర్థాలను కలిగిస్తున్నాయి. కాపర్‌, కాడ్మియం, లెడ్‌, అమ్మోనియం, నైట్రోజన్‌ ఆకై ్సడ్‌, సల్ఫర్‌, డయాకై ్సడ్‌, సోడియం మిశ్రమాలు, మొర్క్యురీ, లిథియం, పొటాషియంతోపాటు లోహ మిశ్రమాలను బాణాసంచాల తయారీలో వినియోగిస్తారు. వీటిని కాల్చడం ద్వారా ఊపిరితిత్తులు, చర్మం, కళ్లకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అలాగే క్యాన్సర్‌, గుండెజబ్బులు, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కూడా కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శబ్దాలు, ఘాటువాసనల వల్ల చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

టపాసులు వద్దు.. మొక్కలు ముద్దు

దీపావళి రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు టపాసులకు బదులు ఒక మొక్కును బహుమతిగా ఇవ్వాలి. టపాసులు కాల్చితే కలిగే నష్టాలను వివరించి అవకాశం ఉన్న చోట ఒక మొక్కను నాటించి దానిని పెంచి పెద్ద చేసేలా పిల్లలను సమాయత్తం చేయాలి. అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీపావళికి ముందు రోజు కొంత మంది విద్యార్థులను ఒక జట్టుగా చేసి వారిచే పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటించి, సంరక్షించే బాధ్యతను ఆ విద్యార్థులకే అప్పచెప్పాలి. ప్రతి ఏడాది దీనిని ఓ సంప్రదాయంగా చేపట్టేలా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలి. ఎట్టి పరిస్థితుల్లో టపాసులు కాల్చకూడదని, దీపాలు వెలిగించి, మొక్కలు నాటి దీపావళి జరుపుకొనేలా ఇటు తల్లిదండ్రులతోపాటు అటు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేసినప్పుడే హరిత దీపావళి సాధ్యం కాగలదని విద్యావంతులు అంటున్నారు.

రేపే పండుగ.. మారాలి సంబరాల శైలి

బాణసంచాలతో పర్యావరణానికి ముప్పు

మొక్కలు నాటుదాం.. పచ్చదనం పెంచుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement