అనుమతి లేని బాణాసంచా విక్రయాలపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని బాణాసంచా విక్రయాలపై కఠిన చర్యలు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

మదనపల్లె టౌన్‌ : దీపావళి పండుగ నేపథ్యంలో లైసెన్‌న్స్‌ లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన వ్యాపారులు మాత్రమే టపాసులు అమ్మాలని ఎస్పీ శుక్రవారం మదనపల్లెలో స్పష్టం చేశారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల్లో టపాసుల అమ్మకాలు పూర్తిగా నిషేధమని, కేవలం ఓపెన్‌ గ్రౌండ్స్‌లోనే స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి దుకాణంలో తప్పనిసరిగా నీరు, ఇసుక, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని, చిన్నపిల్లలతో పనులు చేయించవద్దని సూచించారు. అక్రమ నిల్వలు, నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు గట్టి నిఘా ఉంచి ముమ్మర తనిఖీలు చేపడతారన్నారు. అక్రమ విక్రయాలపై ప్రజలు డయల్‌ 100 లేద 112కు ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నిబంధనలు పాటిస్తూ సురక్షిత దీపావళి జరుపుకోవాలని కోరారు.

దీపావళి వేళ అప్రమత్తత అవసరం

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయించే దుకాణాల నిర్వాహకులు, ప్రజలు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని డీడీఆర్‌ అండ్‌ ఎఫ్‌ఓ ఆదినారాయణ రెడ్డి సూచించారు. టపాసుల దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు పొందాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్‌ షార్ట్‌ సర్‌క్యూట్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో పొగతాగడం, నిప్పు వెలిగించడం పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు. ప్రజలు టపాసులు కాల్చేటప్పుడు పిల్లలను ఒంటరిగా వదలకుండా పెద్దల పర్యవేక్షణలోనే కాల్పించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement