పెద్దమండ్యం : మండలంలోని పాపేపల్లెలో తాగునీటి సమస్య నెలకొంది. పది రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు మోటారు మరమ్మతులు చేసినా విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరు వదలడం లేదని ఆరోపించారు. పది రోజులుగా సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో తాగునీటి బోరు మోటారు వద్దకు వచ్చి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడపడితే ఆక్కడ గేట్‌వాల్వ్‌లు అమర్చి కుళాయిలకు నీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. మోటారుకు విద్యుత్ సరఫరా ఇచ్చి తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.


