రొంపిచెర్ల: చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. శుక్రవారం అధికారులు పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు. మండలంలోని గానుగచింత, మోటుమల్లెల, రొంపిచెర్ల, బొమ్మయ్యగారిపల్లె, పెద్దమల్లెల, బోడిపాటివారిపల్లె, పెద్దగొట్టిగల్లు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ అధికార పార్టీ కనుసన్నల్లో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుటికీ , నిబంధనలను బేఖాతరు చేస్తూ కూటమి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికే ఓటు వేయాలని, లేకపోతే పెన్షన్ తొలగిస్తామని బెదిరించారు. ఈ విషయం రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కోటా సుష్మ కి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని, అయితే ఇక్కడ అధికారులు చేతులు పైకి ఎత్తివేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించడంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని అధికారుల మీద, టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కోటా సుష్మ కోరారు.
పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
ఓట్లు వేయకపోతే పెన్షన్ తొలగిస్తామని బెదిరింపులు
ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన
వైఎస్సార్సీపీ


