కూటమి అరాచకాలను ఓటుతో తిప్పికొట్టండి | - | Sakshi
Sakshi News home page

కూటమి అరాచకాలను ఓటుతో తిప్పికొట్టండి

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

వాల్మీకిపురం : కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశం నిర్వహించి, మండలాల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దెబ్బతిందని, ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలందరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రెండున్నరేళ్లుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిన కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడదామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వం నడుస్తుందా అని ప్రశ్నించారు. ఒక వైపు ఆకాశాన్ని అంటుతున్న ధరలు, మరో వైపు కార్పొరేట్‌ శక్తులతో అంటకాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెరసి సామాన్యుడు బతకడానికి ఏం చేయాలో అర్థం గానీ పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటూ వల్లెవేసిన చంద్రబాబు డబుల్‌ ఇంజిన్‌లో ఏం రిపేరుకొచ్చిందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన అభ్యర్థులపై కూడా తెలుగు తమ్ముళ్లు దాడులు చేయడం రెడ్‌బుక్‌ రాజ్యాంగం కాదా అంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు వేయకుండా అడ్డుకొని తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసులు పెట్టించింది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు. ప్రతి విషయంలో తమ వారికి మాత్రమే లబ్ధి చేకూర్చుకోవాలనే చంద్రబాబు ఆలోచన సరికాదన్నారు. ఎన్నికల వరకే పార్టీలు గానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి తన ధోరణిలోనే వెళ్తున్నారని, ఇటువంటి చర్యలు భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు పంపించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ హయాంలోనే సంక్షేమ పాలన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎన్నికల వరకే రాజకీయాలు చేశారని, ఆ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సూపర్‌సిక్స్‌ అంటూ డబ్బాలు కొట్టిన పాలకులు.. వాటిలో ఒక్కటైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పగలరా అంటూ సవాల్‌ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వ అరాచకాలను అసహ్యించుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ఇదే సరైన సమయమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చింతల సాయిక్రిష్ణారెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి, ఇక్బాల్‌ అహ్మద్‌, సతీష్‌రెడ్డి, రత్నశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, అప్పల్లా, వెంకటరమణారెడ్డి, రమేష్‌రెడ్డి, రాహుల్‌ చక్రవర్తి, రఫీ, రాజశేఖర్‌, మస్తాన్‌, రెడ్డి నరసింహులు, రాజగోపాల్‌ రెడ్డి, ఇబ్రహిం, నీళ్లభాస్కర్‌, రవికుమార్‌రెడ్డి, సుబ్బారెడ్డి, జయచంద్రారెడ్డి, ముక్తియార్‌, నక్కా చంద్రశేఖర్‌, శ్రీనివాసులురెడ్డి, శ్రీధర్‌రాయల్‌, ఆనంద, జమీర్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే దౌర్జన్యంగా ఏకగ్రీవాలు

కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యం

ఎంపీ మిథున్‌రెడ్డి,

మాజీ ఎమ్మెల్యే చింతల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement