బెదిరింపులపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలి

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

● అడ్డమార్గాల్లో గెలవాలని టీడీపీ యత్నం

● కార్యకర్తలు సైనికులై పోరాడాలి

● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రొంపిచెర్ల : స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకుల బెదిరింపులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటా సుష్మ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్డ మార్గంలో గెలవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోలింగ్‌ బూతుల్లో కూర్చునే ఏజెంట్లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేమని రిగ్గింగ్‌ చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైనికులై పోరాటం చేయాలన్నారు. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, రెడ్డిశ్వర్‌రెడ్డి, దేవులపల్లె హరినాథరెడ్డి, చెంచురెడ్డి, సలీంబాషా, మహబుబ్‌బాషా, అల్లాబక్స్‌, సూర్య నారాయణరెడ్డి, విజయశేఖర్‌, శ్రీనాథనాయుడు, రామకృష్ణనాయుడు, కమలాకర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామ నారాయణ రెడ్డి, నీరజాక్షుల నాయుడు, రవీంద్ర, మాంజూర్‌, బావాజీ, ఓబులేసు, కిషోర్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పీర్‌ బాషా ప్రచారం

మదనపల్లె (కురబలకోట) : మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి టీఎ. పీర్‌ బాషా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పట్టణంలో మసీదుల వద్ద నిర్వహించిన ప్రచారానికి ఆదరణ లభించింది. పీర్‌ బాషాను గెలిపించాలని బాస్‌ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్‌ కోరారు. ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, వక్ఫ్‌ సవరణ చట్టం, ఎస్‌ఐఆర్‌ వంటి దుర్మార్గమైన చట్టాలతో ముస్లింల హక్కులను కాలరాస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కనువిప్పు కలిగించాలన్నారు. కూటమికి ముస్లింలను ఓటు హక్కు అడిగే హక్కులేదన్నారు. టీఎ. పీర్‌బాషాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, కే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాగే ఇండియా కూటమి నాయకులు పట్టణంలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తూ కుండ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement