పచ్చ మరకలు... | - | Sakshi
Sakshi News home page

పచ్చ మరకలు...

Oct 28 2026 5:48 AM | Updated on Oct 28 2026 5:48 AM

● ఇదీ.. అభివృద్ధి...
వైఎస్సార్‌ సీపీ హయాంలోపులివెందుల అభివృద్ధి నింగినంటింది. తరాలు చెప్పుకునేలా .. జనాలు హర్షించేలా వైఎస్‌ జగన్‌ పాలన సాగించారు.‘విద్య’కు కోట్ల రూపాయలతో అక్షరాభిషేకం చేశారు. వైద్యానికి కొత్త ‘ఊపిరి’ పోశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించారు.. ప్రయాణికులకు సౌకర్యాన్ని పంచారు..బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌తో రైతులకు నేస్తంగా నిలిచారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టి క్రీడాకారులకు దోస్త్‌గా మారారు.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రగతిని ‘పట్టా’ లెక్కించారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తూ అక్కచెల్లెమ్మలకు ‘పట్టా’భిషేకం చేశారు.పులివెందుల చరిత్రలోనే ‘నవ’శకానికి నాంది పలికారు.
చంద్రబాబు హయాంలో

రికార్డుల పరిశీలన

పులిచెర్ల (రొంపిచెర్ల): పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చిత్తూరు జిల్లా డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ నాగ శశిభూషణ్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు వాటి నివేదికలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో డాక్టర్‌ అనిల్‌ రెడ్డి, వైద్యాధికారులు వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

మదనపల్లె సిటీ: మదనపల్లె ఉప విద్యాశాఖ అధికారిగా పద్మావతి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక బెంగుళూరు రోడ్డులోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. డివిజన్‌లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేస్తాన్నారు. డీవైఈఓను ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌, కడియాల మురళి, రాజారెడ్డి, కుసుమ, రమాదేవి, అశోక్‌, శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్‌ మోహన్‌రెడ్డి, హెచ్‌ఎం అసోసియేషన్‌ శ్రీనివాసులు, చంద్రకళ, అపస్‌ రమణారెడ్డి, ఏపీటీఎఫ్‌ శ్రీనివాసులు తదితరులు అభినందించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

తంబళ్లపల్లె: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి బాలకృష్ణ తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ఉపసంహరణ తీరును పరిశీలించారు. నామినేషన్లు వేసిన విధానం, స్కూటినీ నిర్వహించిన తీరు తదితర అంశాలపై ఆర్‌ఓ శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు.

వీఆర్‌లో ఉన్న 15 మంది పోలీసులకు పోస్టింగ్‌లు

మదనపల్లె టౌన్‌: చిత్తూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చి ప్రస్తుతం వీఆర్‌ లో ఉన్న 15 మంది పోలీసు సిబ్బందికి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరక్‌ కునుబిల్లి పోస్టింగ్‌ లు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు సొంత ఖర్చుతో ఈ అటాచ్‌ మెంట్‌ ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా కలికిరి, ములకలచెరువు, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, మదనపల్లి 1 టౌన్‌, 2 టౌన్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్లు మరియు ఎలక్షన్‌ సెల్‌ కు సిబ్బంది 15 మందిని అటాచ్‌ చేశారు. వీఆర్‌ లో ఉన్న సిబ్బందిని వెంటనే రిలీవ్‌ చేసి, సంబంధిత స్టేషన్లలో రిపోర్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ , ఇన్‌స్పెక్టర్లను ఎస్పీ ఆదేశించారు.

పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన తీరును వివరిస్తుంటే...ప్రతి ఒక్కరి మనసుల్లో ఆలోచన

కలిగించింది. పార్టీ కార్యకర్తలకు నిండు భరోసా కలిగింది.

జననాయకుడిగా పులివెందుల గడ్డ నుంచే

‘పోరు’కు సై అంటూ సవాల్‌ విసరడంతో

అభిమానగణం మురిసిపోయింది.

సాక్షి కడప : ‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు అంతేలేదు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం....రౌడీయిజం, గుండాయిజం చేస్తూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలు చించివేస్తూ వికృత చేష్టలు చేశారు.. నామినేషన్‌ కేంద్రం వద్ద బారికేడ్లు దాటుకుని ముందుకు వెళితే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. చివరికి కేంద్రాలకు వెళ్లినా లోపల రిటర్నింగ్‌ అధికారులు కూడా నామినేషన్‌ విషయంలో తేడాలు చూపించారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సందర్భంగా అక్కడో, ఎక్కడో పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ చేసుకున్నట్లు విన్నాం. కానీ, నామినేషన్లే వేయనీయకుండా అడ్డుపడటం ఇప్పుడు చూస్తున్నాం.. నామినేషన్‌ కాకుండా సెలెక్షన్‌ అని పెట్టుకుంటే బాగుండేది. అప్పుడు ఎవరిని కావాలంటే వారిని సెలెక్ట్‌ చేసుకోవచ్చు.. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పులివెందులలో మాట్లాడుతూ నామినేషన్స్‌ వేయనీయకుండా అడ్డుకునే బదులు నేరుగా నామినేట్‌ చేసుకుంటే పోతుంది కదా అని సీఎం చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ ఉండదని ఇప్పటికై నా ప్రజలు ఏకతాటిపై నిలిచి హక్కుల కోసం పోరాటం చేసేందుకు కలిసి రావాలని జగన్‌ పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి..

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. అందుకు సంబంధించి మంగళవారం పులివెందులలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌ఛార్జిలు చవ్యా దుష్యంత్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్‌ మధురెడ్డిలతో కలిసి తొలుత పులివెందుల మున్సిపల్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోటీ లో ఉన్న అభ్యర్థులతోపాటు వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డితోపాటు కార్పొరేటర్‌ అభ్యర్థులు, జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బరిలో ఉన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నామినేషన్లు వేయడం కోసం అభ్యర్థులు పడిన కష్టాలు తెలుసు... ఎన్నికలతోపాటు కౌంటింగ్‌ సందర్భంలోనూ టీడీపీ నేతలు ఇబ్బందులు పెడతారని తెలిసినా పోరాటం చేస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేయడమే మన కర్తవ్యమని హితబోధ చేశారు.

పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ సందర్భంలో జరిగిన పోలీసుల దాడుల్లో గాయపడిన పులివెందుల మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌ను మంగళవారం ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో

ప్రగతి పరుగులు...

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.20కోట్లతో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. చంద్రబాబు ప్రభుత్వం పనులు ముందుకు సాగకుండా చేసింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ. 500 కోట్లకు పైగా నిధులతోపులివెందులలో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేసింది.

రూ.65కోట్లతో.. ఉలిమెల్ల చెరువు సుందరీకరణ...

ఉలిమెల్ల చెరువు సుందరీకరణ, పార్కు నిర్మాణంతో ఆహ్లాదాన్ని పంచారు.

రూ. 14 కోట్లతో.. పులివెందుల శిల్పారామం అభివృద్ధి చేసింది.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్తులను కూడా లాక్కుంటారు

న్యాయం కోసం గట్టిగా నిలబడి పోరాడాలి

కడపతోపాటు పులివెందులలో న్యాయం, ధర్మం గెలవాలి

ఎన్ని కష్టాలు ఎదురైనా గుండె ధైర్యంతో ముందడుగు వేయండి

పులివెందుల, కడప మున్సిపల్‌ అభ్యర్థులు, కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

నామినేషన్లను అడ్డుకోవడం...

దాడులకు తెగబడిన ఘటనలపై ఆరా

అన్నింటికి సమాధానం

జగన్‌ 2.0లో చెబుదాం

క్యాంపు కార్యాలయంలో ప్రజలు,

కార్యకర్తలతో మమేకమైన వైఎస్‌ జగన్‌

పచ్చ నేతల అరాచకాలపై దునుమాడుతుంటే..

అభిమానుల్లో కసి రెండింతలైంది..

ఖాకీల కుతంత్రాలపై నిప్పులు చెరుగుతుంటే..

పార్టీ నేతల కళ్లల్లో ఎరుపొచ్చింది...

‘మీకు తోడుగా ఈ అన్న ఉన్నాడ’న్నప్పుడు..

కార్యకర్తల ఒంటి నిండా ధైర్యం వచ్చింది...

‘మీ మీద చేయి వేస్తే..నా మీద వేసినట్లే..’ అన్నప్పుడు

అభిమానుల గుండె ఉప్పొంగింది..

‘పోలింగ్‌ రోజు నేనుంటా.. ఎవరొస్తారో..ఎంతమంది వస్తారో

అన్యాయం చేస్తారా... రాండి’ అని సవాల్‌ విసురుతుంటే..

అభిమానగణంలో ఉత్సాహం ఉరకలెత్తింది..

‘కష్టకాలంలో తోడుగా ఉన్న మీకు రుణపడి ఉంటా’ అన్నప్పుడు..

పులివెందుల నేల భావోద్వేగంతో తడిసి ముద్దయ్యింది..

‘మా జగన్‌.. మా నాయకుడు’ అని

ఈలలతో.. చప్పట్లతో ఆ ప్రాంతం మార్మోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement