తంబళ్లపల్లె : తంబళ్లపల్లె మండలానికి చెందిన యువకుడు షాజహాన్ బాషా మూడు రోజుల క్రితం కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తికి గాయాలు
మదనపల్లె టౌన్ : మిద్దె పైన ఉన్న నీళ్ల డ్రమ్ముకు పైపు ద్వారా నీళ్లు నింపుతుండగా విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌తో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమండెం మండలం కలిచర్ల పంచాయతీ శెట్టివారిపల్లికి చెందిన రైతు రామిశెట్టి(45) మంగళవారం సాయంత్రం తన మిద్దైపె డ్రమ్ముకు నీళ్లు పడుతున్నాడు. ఆ సమయంలో తలపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో మిద్దైపె నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రుయాకు రిఫర్ చేయగా, వారు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెద్దమండెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


