‘పుర’ పోరు.. ప్రచార హోరు | - | Sakshi
Sakshi News home page

‘పుర’ పోరు.. ప్రచార హోరు

Oct 28 2026 5:48 AM | Updated on Oct 28 2026 5:48 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, చైర్మన్‌ అభ్యర్థి జింకా వెంకటా చలపతి, కౌన్సిల్‌ అభ్యర్థులు మంగళవారం ఇంటింటా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులతో కలిసి నాయకులు, కార్యకర్తలు కరపత్రాలతో వెళ్లి.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చైర్మన్‌, కౌన్సిల్‌ అభ్యర్థులకు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నిసార్‌ అహ్మద్‌ 29, 33 వార్డు అభ్యర్థులు షర్మిలా బాను, ఈశ్వర్‌ నాయకులతో కలిసి ప్రచారం చేశారు. నరేష్‌కుమార్‌రెడ్డి, జింకా వెంకటా చలపతి, పరిశీలకులు బావాజాన్‌ 16, 17 వార్డు అభ్యర్థులు సుగుణ, లావణ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి 7, 8, 9, 10, 11 వార్డు అభ్యర్థులు ప్రసాద్‌ బాబు, శివరాణి, నరసమ్మ, సుభాషిణి, సుధాకర్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

మదనపల్లెను అభివృద్ధి చేస్తాం

ఈ సందర్భంగా నిసార్‌ అహ్మద్‌, తిప్పారెడ్డి, నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన ప్రయోజనాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హామీలు, వాటి అమలు తీరుపై వివరించారు. గత పాలన, ప్రస్తుత పాలనలోని విధానాలను బేరీజు వేసుకుని, మున్సిపాలిటీ అభివృద్ధి, వార్డు సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పి.అమరేంద్ర నాయక్‌, బి.హరిప్రసాద్‌ నాయక్‌, చాంద్‌ బాషా, మహబూబ్‌ బాషా, త్రిపాల్‌ నాయక్‌, బాబు నాయక్‌, మహిళా నాయకురాలు సుశీల, మైనారిటీ నాయకుడు యూనుస్‌, మల్లికార్జున, ఫక్రు, సాదిక్‌, అబ్దుల్లా, రియాజ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీవైఎస్‌ ప్రచారం

స్థానిక ఏడవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శశికుమార్‌కు మద్దతుగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌కుమార్‌ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పీర్‌ బాషాకు సీపీఐ మద్దతు

మదనపల్లి (కురబలకోట) : మదనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి వీసీకె, బాస్‌ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి టీఏ పీర్‌బాషాకు సీపీఐ మద్దతు ప్రకటించింది. మంగళవారం పీసీకే నాయకుడు పీటీఎం శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సీపీఐ, బాస్‌ నాయకులు పార్టీ నేతలను కలసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన సీపీఐ రాజకీయ మార్పు కోసం ప్రజలు పీర్‌బాషాను ఆదరించాలని కోరారు.

దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement