రైతుపై తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

రైతుపై తేనెటీగల దాడి

Oct 28 2026 5:48 AM | Updated on Oct 28 2026 5:48 AM

మదనపల్లె టౌన్‌ : పొలం వద్దకు వెళుతున్న రైతుపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తెట్టు గ్రామానికి చెందిన రైతు నక్క ఈశ్వరప్ప(50) ఊరి సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు నడిచి వెళుతుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు.

వాహనాల పరిశీలన

మదనపల్లె టౌన్‌ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలించే అక్రమ నగదు, మద్యం, కానుకల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మంగళవారం మదనపల్లె చీకలబైలు సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేటప్పుడు సరైన ఆధారాలు ఉంచుకోవాలని, అక్రమాలు గమనిస్తే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement