ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

మదనపల్లె సిటీ: జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 1,768 పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేక బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్‌ స్కూల్‌ కలకడ, ఏపీ మోడల్‌ స్కూల్‌ పెద్దమండ్యం, ఏపీ మోడల్‌ స్కూల్‌ అడవినాథునికుంటలో వాయిదా పడ్డాయి. మదనపల్లె మండలం బసినికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్‌ఎంసి ఎన్నికలను సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అనూరాధ పర్యవేక్షించారు. పాఠశాలల అభివృద్దిలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంలో బలోపేతం అవుతాయన్నారు.

ఎస్‌ఎంసీ చైర్మన్ల ఎన్నికలో

టీడీపీ బలవంతం

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో పలుచోట్ల టీడీపీ నేతలు హంగామా చేశారు. రామసముద్రం మండలంలోని 80 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు జరిగాయి. పలు చోట్ల కూటమి నాయకుల ఆదేశాల మేరకు చైర్మన్లు ఎన్నికయ్యారు. అరికెల జెడ్పి హైస్కూల్‌లో వైఎస్సార్‌ సీపీకి చెందిన శ్రీనివాసులు రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా నియోజకవర్గ, మండల స్థాయి టీడీపీ నాయకులు సమావేశానికి వచ్చి నానా హంగామా చేశారు. టీడీపీ వ్యక్తిగా ఉంటేనే డిక్లరేషన్‌ ఇచ్చేందుకు అనుమతి ఇస్తామని దౌర్జన్యం చేశారు. ఈ పరిస్థితుల్లో కొంతసేపు సమావేశం వాయిదా పడింది. దానికి ఒప్పుకోకపోవడంతో తిరిగి ప్రలోభ పెట్టి, చివరికి కండువా వేసి తమ పార్టీ అభ్యర్థిగానే ప్రకటించుకొని డిక్లరేషన్‌ ఇప్పించారు. రామసముద్రం హైస్కూల్‌లో చాంద్‌బాషా, మట్లవారిపల్లిలో చిన్న బాబా సాహెబ్‌, చెంబకూరులో సోమశేఖర్‌, కే.సీ.పల్లిలో కల్పన, అరికెలలో శ్రీనివాసరెడ్డి, ఏపీ మోడల్‌ స్కూల్‌లో చెన్నకేశవ, చొక్కాండ్లపల్లిలో శశికళ, కేజీబీవీలో సరస్వతి చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

కోరం లేక నాలుగు చోట్ల వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement