సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

మదనపల్లె టౌన్‌: మదనపల్లెకు అక్టోబర్‌ 2న సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాక నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మంగళవారం ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి.. కొండామారిపల్లి హెలిప్యాడ్‌, బీకేపల్లి కాలనీ సభా ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించారు. వీఐపీ కాన్వాయ్‌ రూట్‌ మ్యాప్‌, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు అమలు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ, అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, డీఎస్పీ బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

రాయచోటి : అక్టోబర్‌ రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు అన్నమయ్య జిల్లా కలెక్టర్లు సమీక్షించారు. మంగళవారం రాయచోటిలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లతో పాటు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement