బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

రొంపిచెర్ల : బాలికలు ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఆర్‌వీఎం పీవో వెంకటరమణ అన్నారు. రొంపిచెర్ల కస్తూర్భా గురుకుల పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

బాలికలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వ్యవహరించాలని అన్నారు. ప్రమాద పరిస్థితులను ముందుగానే గుర్తించి తమను తాము రక్షించుకునేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం వ్యాచరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జీసీడీవో కృష్ణవేణి, ప్రిన్సిపాల్‌ స్వరూప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement