పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రదర్శన

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల వివరాలు

అభ్యంతరాల స్వీకరణకురేపు మండలాల్లో పార్టీలతో సమావేశాలు

జిల్లాలో 320 ఎంపీటీసీ స్థానాలు

సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఎంపీడీవోలు పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రచురించారు. దీనిపై అభ్యంతరాలను, సూచనలు, సలహాలను కోరుతూ బుధవారం జిల్లాలోని 25 మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

320 ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో 25 మండలాలు ఉండగా ఒక మండలానికి ఒక ఒక జెడ్పీటీసీ ఉండనున్నారు. అలాగే మండల వారీగా బి.కొత్తకోటలో 11, చౌడేపల్లిలో 12, గుర్రంకొండలో 12, కేవీ పల్లెలో 12, కలకడలో 11, కలికిరిలో 13, కురబలకోటలో 12, మదనపల్లెలో 27, ములకలచెరువులో 13, నిమ్మనపల్లిలో 9, పెద్దమండ్యంలో 10, పెద్దతిప్పసముద్రంలో 15, పీలేరులో 21, పుంగనూరులో 16, రామసముద్రంలో 14, సదంలో 10, సోమల 12, తంబళ్లపల్లెలో 11, వాయల్పాడులో 13, గాలివీడులో 14, లక్కిరెడ్డిపల్లిలో 11, రామాపురంలో 10, సంబేపల్లిలో 11, రాయచోటిలో 10, చిన్నమండెంలో 10 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

కడప : ఎస్‌ఎఫ్‌ స్ట్రీట్‌లో ధాన్యంతో వినాయకుడు

గణపయ్యకు ‘ఆధార్‌’

పేరు: శ్రీ గణేష్‌, తండ్రి పేరు: శివుడు,

చిరునామా: నాగిరెడ్డిపల్లి.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మదర్‌ థెరిసా వీధి యువత వినూత్నంగా ఆలోచించారు. గణపయ్యకు ఆధార్‌, పాన్‌ కార్డు థీమ్‌తో మండపాన్ని తీర్చిదిద్దారు.

డివిజన్‌ పోలింగ్‌ పురుషులు మహిళలు

కేంద్రాలు

పీలేరు 1,372 1,46,349 1,52,250

మదనపల్లె 2,058 2,12,660 2,20,246

రాయచోటి 874 87,684 90,334

మొత్తం 4,304 4,46,693 4,62,830

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement