అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

సాక్షి, మదనపల్లె: జిల్లా మెరుగైన అభివృద్ధి సాధించడంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశహాలులో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ల సమావేశంలో సీఎం నిర్దేశించిన వివిధ అంశాలపై చర్చించారు. శాఖల వారీగా ఇచ్చిన నిర్దేశిత లక్ష్యాల అమలులో ప్రస్తుత పరిస్థితి, సమస్యలు, చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన యాక్షన్‌ పాయింట్లను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో మంత్లీ ఎకనామిక్‌ రిపోర్టులో రాష్ట్రస్థాయిలో మొద టి ర్యాంకు సాధించడం, పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌లో జిల్లా పనితీరు గణనీయంగా మెరుగుపడటంపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక ప్రగతి రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. కాగా జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా జేసీ శివ్‌నారాయణ్‌ శర్మ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కలెక్టరుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement