ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలోని బి. కొత్తకోట మండలానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి, మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలంలోని అమ్మ చెరువుకు చెందిన వెంకట రెడ్డప్ప (58) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందించారు. దీంతో అతడు కోలుకుంటూ ఉన్నాడు. బి కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement